భారతదేశం, ఏప్రిల్ 24 -- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్...జులై కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ నేడు గురువారం విడుదల చేయనుంది. జులై నెల ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నిన్న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్లో విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై కోటాను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసింది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు జులై నెల కోటా ప్రత్యేక ద‌ర్శనం ఉచిత టోకెన్లను బుధవారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశారు.

జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్లను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీ...