Tirumala,andhrapradesh, ఏప్రిల్ 24 -- తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయని వివరించింది. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్లు ప్రకటించింది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేల‌ములు) 0877-2264429 నంబ‌రును సంప్రదించాలని టీటీడీ సూచించింది. కార్యాలయం వేళల్లో లేదా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.govt.i...