Andhrapradesh,tirumala, జూన్ 25 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే జూలై నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. జూలై 10వ తేదీన గురు పౌర్ణమి గరుడసేవ ఉంటుంది. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానంతో పాటు మరికొన్ని తేదీల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసంది. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన...