భారతదేశం, డిసెంబర్ 24 -- శ్రీ‌వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మార్తి నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి వసతి గదుల కోటా అందుబాటులోకి వస్తాయని వివరించింది.

శ్రీ‌వారి ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు ఇతర దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి... మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎలాంటి లోటుపాట్లు ల...