Andhrapradesh,tirumala, జూలై 30 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఆగస్ట్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ జరగనుంది. ఆగ‌స్టు 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ ఉండనుంది. ఆగ‌స్టు 17వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చిపై ఊరేగిస్తారు.

Published by HT Digital Content Services with pe...