Tirumala,andhrapradesh, జూలై 11 -- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన ఉత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు. చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.

* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

* 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

* 24-09-2025 ధ్వ...