భారతదేశం, ఏప్రిల్ 27 -- వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీతో ప్రజాప్రతినిధులు జారీ చేసిన సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పందించారు. సిఫారసు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనంపై స్పష్టత ఇచ్చారు.

ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం యథాతథంగా కొనసాగుతోందని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. బోర్డు సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలతో దర్శనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మే, జూన్‌ నెలలకు సంబంధించి ముందుగా లేఖలు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనాలు యథాతథంగా ఉంటాయన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సర్వదర్శనం ట...