భారతదేశం, డిసెంబర్ 10 -- తిరుపతిలాంటి ప్రపంచ ప్రఖాత్య క్షేత్రంలో తాజాగా మరో స్కామ్ బయపడింది. ఇప్పటికే పలు రకాల విషయాల్లో తిరుపతి పేరు బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. శ్రీవారి ఆలయంలో అతిథులు, వీఐపీలకు, ప్రత్యేక సేవల్లో ఉపయోగించే పట్టువస్త్రాలు నాణ్యత కలిగి ఉండాలి. అయితే పట్టువస్త్రాలకు బదులుగా పాలిస్టర్‌ను సరఫరా చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో 2015 నుండి 2025 వరకు దశాబ్ద కాలం పాటు రూ.54 కోట్ల భారీ పట్టు వస్త్రాల కుంభకోణం బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. ఒక కాంట్రాక్టర్ 100 శాతం పాలిస్టర్ వస్త్రాలను నిరంతరం సరఫరా చేస్తున్నాడని, టెండర్ పత్రాలలో పేర్కొన్న స్వచ్ఛమైన పట్టు ఉత్పత్తులుగా వాటిని బిల్ చేస్తున్నట్లు అంతర్గత విజిలెన్స్ విచారణలో తేలింది. తర్వాత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

టీటీడీ ...