Tirumala,telangana, జూలై 25 -- తిరుమల వెంకన్నపై ఓ మాజీ ఐఆర్ఎస్ అధికారి అచంచ‌ల‌మైన‌ భ‌క్తిని చాటుకున్నాడు. ఆయన బ్రతికుండగానే. తనకు చెందిన విలువైన ఆస్తులను శ్రీవారికి చెందాలని వీలునామా రాశాడు. సదరు మాజీ అధికారి మరణించటంతో. ఆయన వీలునామా రాసిన పత్రాలు టీటీడీకి అందజేశారు. ఇందులో రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు ఆయన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌లు ఉన్నాయి.

వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు.. మాజీ ఐఆర్ఎస్ అధికారి. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న "ఆనంద నిలయం" అనే 3,500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయ‌న టీటీడీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు వీలునామాలో పేర్కొన్నారు.

త‌న బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.36 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర స‌ర్...