భారతదేశం, జనవరి 28 -- తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బుధవారం (జనవరి 28) ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాడు. తన ఇద్దరు కుమారులు యాత్రా (Yatra), లింగా (Linga)లతో కలిసి అతడు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ పట్టు వస్త్రాలు (ధోతీ, అంగవస్త్రం) ధరించి కనిపించారు.

ధనుష్ తిరుమల ఆలయం నుంచి బయటకు రాగానే అభిమానులు అతన్ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. జనం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో, ధనుష్ కుమారులు యాత్రా, లింగా వెంటనే అప్రమత్తమయ్యారు. తండ్రికి ఇబ్బంది కలగకుండా వారిద్దరూ రక్షణ కవచంలా మారి, జనాల మధ్య నుంచి అతన్ని ముందుకు తీసుకెళ్లారు. పిల్లలిద్దరూ తమ తండ్రి పట్ల చూపిన శ్రద్ధ, రక్షణ భావం చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధనుష్, ఐశ్...