Andhrapradesh,tirumala, జూలై 30 -- కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారిపై కొందరు అచంచలమైన భక్తిని చాటుకుంటున్నారు. ఏడు కొండల్లోని శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తారు. అయితే ఇటీవలే కాలంలో. తమ ఆస్తులను కూడా విరాళంగా ప్రకటిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన దంపతులు కూడా శ్రీవారిపై వారికున్న ఎనలేని భక్తిని విరాళం రూపంలో చాటుకున్నారు.

హైదరాబాద్ మల్కాజ్ గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన టి.సునీత దేవి, శ్రీ టి.కనక దుర్గ ప్రసాద్ దంపతులు. రూ.18.75 లక్షల విలువైన 250 చదరపు గజాల గల తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు.

హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆ...