Andhrapradesh,tirumala, ఆగస్టు 13 -- తిరుమలకు వచ్చే వాహనాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేసింది.

ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదని స్పష్టం చేసింది. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది.

ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుక...