భారతదేశం, అక్టోబర్ 30 -- తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది.

కల్తీ నెయ్యి కేసులో అప్పన్న ఏ- 24గా ఉన్నాడు. బుధవారం రాత్రి సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేయగా.. నెల్లూరులోని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలను పేర్కొంది.

సిట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించారు. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశాడు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ (కేజీ రూ. 329) ఇవ్వా...