భారతదేశం, నవంబర్ 25 -- తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ.. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ 2023లో దొరికారు. అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్ఐ సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సంవత్సరం మే 30వ తేదీన రవికుమార్ మీద విజిలెన్స్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల అనంతరం సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే.. కేసు నుంచి తప్పిస్తే.. తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్...