Andhrapradesh,tirumala, ఆగస్టు 30 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే సెప్టెంబర్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి, సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని పేర్కొంది. ఇక ఇదే నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి.

* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

* 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

* 24-09-2025 ధ్వజారోహణం(శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం)

* 28-09-2025 గరుడ వాహనం.

* 01-10-2025 రథోత్సవం.

* 02-10-2025 చక్రస్నానం.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖ...