Andhrapradesh,tirumala, జూలై 26 -- తిరుప‌తి అలిపిరిలోని సప్త గోప్ర‌ద‌క్షిణ‌ మందిరంలో ప్ర‌తి రోజు నిర్వ‌హించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్ర‌హం టికెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆఫ్ లైన్ లో టికెట్లు ఇవ్వొద్దని నిర్ణయించింది. ఆగ‌స్టు 1వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

ప్ర‌తి రోజు భ‌క్తులకు క‌రెంటు బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు. ఆగ‌స్టు 1వ తేదీ నుండి మొత్తం 200 టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే జారీ చేయాల‌ని నిర్ణ‌యించినట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోరింది.

భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్ల...