Andhrapradesh,tirumala, సెప్టెంబర్ 3 -- తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....