Tirumala,andhrapradesh, జూన్ 20 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించే మొబైల్ ఫోన్లను వేలం వేయనుంది. ఇందులో ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్నవి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.

74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ - వేలం వేయనున్నారు. కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఇందులో ఉన్నాయి.

ఆసక్తి ఉన్నవారు ఆంధ్రప్రదేశ్ ప్...