Andhrapradesh,tirumala, జూలై 23 -- తిరుమల శ్రీవారి భక్తులకు మరో అప్డేట్ వచ్చేసింది. మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు కొత్త కౌంటర్ ను ప్రారంభించింది. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్రం తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పాటైన ఈ కేంద్రంలో ఇవాళ్టి నుంచి టికెట్ల పంపిణీ ప్రారంభమైంది. భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.

తిరుమలలో నూతనంగా ఏర్పా...