భారతదేశం, డిసెంబర్ 31 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని చక్రస్నాన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది. ‌ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రాతఃకాల కైంకర్యాలు ముగించారు. ఆ తర్వాత గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు.

పల్లకీలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య శుభముహుర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....