భారతదేశం, డిసెంబర్ 27 -- తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుంచ జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు కల్పించనున్నారు. ఇందుకోసం విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవాళ తిరుమ‌ల‌లోని శిలా తోర‌ణం వ‌ద్ద టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి ఏర్పాట్లను పరరిశీలించారు. ద‌ర్శ‌న క్యూలైన్ల‌ల‌ను అధికారుల‌తో క‌లిసి త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. క్యూలైన్ల‌లో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్ర‌సాదం పంపిణీ, మ‌రుగుదొడ్ల‌ సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి భ‌క్తుల‌తో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు పుర‌స్క‌రించుకుని చాలా వ‌ర‌కు ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే పూర్తి చేశామ‌ని చెప్పారు. భక్తుల అభిప్రాయాల‌ను ప‌...