భారతదేశం, జనవరి 14 -- తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన QR కోడ్ ఆధారిత పాద రక్షలు కౌంటర్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ QR కోడ్ ఆధారిత ఆధునిక పాద రక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో. తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను క...