భారతదేశం, జనవరి 9 -- తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. డిసెంబరు 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు. మొత్తం 10 రోజుల్లో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం దక్కింది.

టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కలిగింది. టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93 శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

2024 ఏడాదిలో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 44 ...