భారతదేశం, డిసెంబర్ 20 -- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలను కల్పించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దర్శనాలను పుర‌స్క‌రించుకుని డిసెంబర్ 23వ తేదీ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఇందుకు సంబంధించి టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

డిసెంబర్ 23వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేయడం జరిగింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో ...