Tirumala,andhrapradesh, సెప్టెంబర్ 14 -- తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

తమిళంలో, కోయిల్ అంటే 'పవిత్ర పుణ్యక్షేత్రం', ఆళ్వార్ అంటే "భక్తుడు". తిరు అంటే "శ్రేష్ఠo", మంజనం అంటే "స్నానం". కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం.

ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన "పరిమళం" అనే సుగంధ...