భారతదేశం, డిసెంబర్ 1 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 2న నిర్వహించే ఈ డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు టిటీడీ టోకెన్లు కేటాయించనుంది.

డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1 మూడో రోజులకు ఆన్‌లైన్ ఈ డిప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీటీడీ మెుబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా 9.3 లక్షలు, ఏపీ ప్రభుత్వం వాట్సాప్‌ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసిందని టీటీడీ వెల్లడించింది. మిగిలిన ఏడు రోజులు జనవరి 2...