భారతదేశం, ఏప్రిల్ 27 -- వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 01 నుంచి జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ మే 01 నుంచి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.

వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 01 నుంచి జులై 15 వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.

అదేవిధంగా మే 01 నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుంచి అమలు చేయనుంది. మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్...