భారతదేశం, జనవరి 28 -- జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియ‌జేశారు. ర‌థ స‌ప్తమి వేడుక‌లు విజ‌య‌వంతమ‌వ్వడంతో అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు,...