భారతదేశం, డిసెంబర్ 25 -- వరుస సెలవులతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు కూడా రద్దీ పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. క్యూలైన్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తాత్కాలికంగా క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని నిలిపివేసిన టీటీడీ. రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లోకి అనుమతించనుంది.

గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అ...