Andhrapradesh,tirumala, మే 9 -- భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. సరిహద్దులతో పాటు పలు రాష్ట్రాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పాక్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు. దేశంలోనూ పలు ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈక్రమంలోనే ప్రముఖ్య అధ్యాత్మిక కేంద్రమైన తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి పలు కార్యక్రమాలు చేపట్టారు.

భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస...