భారతదేశం, ఏప్రిల్ 28 -- తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. ముందుగా దర్శనం టికెట్లు, రూమ్ లు దొరకని వారు ఇబ్బందులు పడుతుంటారు. బస దొరక్క టీటీడీ భక్తుల కోసం వేసిన భారీ షెడ్లలోనే సేదతీరుతుంటారు. తిరుమలలో గదుల కోసం ఎవరిని సంప్రదించాలని సమాచారం లోపంతో భక్తులు ఇబ్బంది పడుతుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక సూచన చేసింది.

తిరుమలలో బస చేయడానికి గదులు దొరక్క ఇబ్బందులు పడే భక్తుల కోసం టీటీడీ ముఖ్య సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ టీటీడీ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్టు చేసింది. తిరుమలలో గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)లో సంప్రదించాలని సూచించింది.

సీఆర్ఓ కేంద్రంలో భక్తులు ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ...