భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మెుదలయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఇవాళ ప్రముఖులు సైతం శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతోంది.

వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి, వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. సాంప్రదాయకంగా వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి నాడు మాత్రమే తెరుస్తారు. అయినప్పటికీ భారీగా భక్తులను రద్దీని నిర్వహించడానికి 2020 డిసెంబర్‌లో వ్యవధిని 10 రోజులకు పొడిగించారు. అప్పటి నుండి ఈ పద్ధతి కొనసాగుతోంది.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ...