భారతదేశం, డిసెంబర్ 16 -- డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాల భద్రత ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలో చర్చించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వర...