భారతదేశం, నవంబర్ 16 -- తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు పలు అంశాలపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులు వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా ఉచిత బస్సులను పెంచాలని సూచించారు. తిరుమలలో ఘన వ్యర్థా పదార్థాలను వేగంగా తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.

టీటీడీ ఆలయాలలో ఉత్సవాల సమయాలలో ఆలయాల సుందరీకరణలో భాగంగా గార్డెన్ విభాగం, ఎలక్ట్రికల్ విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృంధాలు శ...