Tirumala,andhrapradesh, జూన్ 19 -- తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో జె శ్యామల రావు తెలిపారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.

భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయంతో పాటు దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చే...