భారతదేశం, ఏప్రిల్ 21 -- తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవ్వడంపై నిపుణులను సంప్రదించగా...వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు చేశారు.

సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరుమల ఘాట్ రోడ్డుకు చేరుకుంటున్న కార్లు... అధిక వేడిమికి మంటలు అంటుకోవడం, కొన్ని మెకానికల్ సమస్యలు తలెత్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

1.సుదూర ప్రయాణం

500 కి.మీ లాంటి సుదూర ప్రయాణం తర్వాత ఇంజిన్ అప్పటికే చాలా హీట్ లో ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే కార్లు తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ మరింతగా హీట్ ఎక్కుతుంది.

2.కొండలు, వంకర రోడ్లు:

ఘ...