భారతదేశం, జూన్ 20 -- ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ చేసిన కుబేర మూవీ ఈ రోజు రిలీజైంది. జూన్ 20న థియేటర్లకు వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ ప్రీమియర్స్, ఇక్కడ స్పెషల్ షోలు చూసిన వాళ్ల టాక్ బాగుంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారు. నాగార్జున రిచ్ పర్సన్ క్యారెక్టర్ లో కనిపించారు. ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతోంది. కుబేర రిలీజ్ సందర్భంగా ధనుష్ ఈ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామా చిత్రం కుబేరలో జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ తన జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే బిచ్చగాడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని ధనుష్ తెలిపారు. తిరుపతి వీధుల్లో భిక్షాటన చేశాననన్నారు. ఈ క్యారెక్టర్ లో వీధుల్లో అడుక్కున్నా అని వెల్...