భారతదేశం, నవంబర్ 26 -- సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలుపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 20 బోగీలతో పరుగులు పెట్టనుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే (నవంబర్ 27, 2025) అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

తిరుపతి - సికింద్రాబాద్ మధ్య ఇప్పటి వరకు 2 ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌, 14 ఏసీ చైర్‌కార్‌లతో కలిపి మొత్తం 16 బోగీలతో నడిచేది. ప్రయాణికుల విజ్ఞప్తుల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో మరో 4 ఏసీ చైర్‌కార్లను శాశ్వత ప్రాతిపదికన జోడించనున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ మార్గంలో వందే భారత్‌కు స్టాపేజీలు, వేళల్లో ఎటువంటి...