భారతదేశం, నవంబర్ 9 -- తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ క‌పిలేశ్వర‌స్వామివారి హోమం (రుద్రహోమం) శ‌నివారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా న‌వంబరు 8 నుండి 18వ తేదీ వ‌రకు 11 రోజుల పాటు ఈ రుద్రహోమం నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ‌, రుద్రజ‌పం, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, నివేద‌న, హార‌తి నిర్వహించారు. సాయంత్రం పూజ‌, జ‌పం, హోమం, రుద్రత్రిశ‌తి, బిల్వార్చన, నివేద‌న‌, విశేష‌దీపారాధ‌న, హార‌తి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

కార్తీక వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరిగింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తో...