భారతదేశం, నవంబర్ 10 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టుగా సీబీఐ గుర్తించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక పాల సంస్థ 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్లపాటు టీటీడీకి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసిందని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.

నిందితుల్లో ఒకరైన అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ వివరాలను సేకరించింది. నెల్లూరు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో సిట్ ఈ విషయాలను పేర్కొంది. టీటీడీకి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిని సరఫరా చేసే భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి సుగంధ్ మోనోడిగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వంటి రసాయనాలను సరఫరా చేశారు. వీటితోనే నెయ్యిని తయారు చేశారని సీబీఐ గుర్తించింది.

డెయిరీ ప్రమోటర్లు పోమిల్ జైన్, విప...