భారతదేశం, నవంబర్ 11 -- తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణను వేగవంతం చేస్తోంది. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. చాలా సేపు ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారించారు. బుధవారం కూడా టీటీడీ మాజీ ఈవోను విచారించే అవకాశాలు ఉన్నాయి.

వైసీపీ హయాంలో ఈవోగా ఉన్న సమయంలో భారీ మెుత్తంలో కల్తీ నెయ్యి లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ధర్మారెడ్డికి సిట్ ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ధర్మారెడ్డి పదవి కాలంలో టెండర్లు, సరఫరా, రిపోర్టుల గురించి అధికారులు అడిగారు. సిట్ విచారణ నుంచి ధర్మారెడ్డి బయటకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ ఆయనకు తిరుపతి లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ధర్మారెడ్డి తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైప...