భారతదేశం, మే 10 -- తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ వరకు జరుగనున్న విషయం విదితమే. ముందుగా సారెకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారెను తీసుకెళ్లారు. అంతకుముందు శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో సారెను తిరుపతి ఎమ్మెల్యే ఎ. శ్రీనివాసులుకు టీటీడీ ఛైర్మన్, ఈవో అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ... గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోదరి అని ప్రతీతి అని, భక్తుల కోరికలు తీర్చే దైవంగా అమ్మవారు పూజలందుకుంటున్నారని ...