భారతదేశం, మే 18 -- తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. రద్దీకి తగ్గట్టు తిరుపతిలో వసతులు లేవు. దీంతో అన్ని వసతులు ఒకే చోట లభించేలా చర్యలు చేపట్టారు. తిరుపతిలో ఇప్పుడున్న బస్టాండ్‌ స్థానంలోనే ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మించనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణ ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో ఆర్టీసీ తన స్థలాన్ని కేటాయిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొంత సొమ్ము, మరో ప్రైవేటు గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి దాని ద్వారా కొంత డబ్...