భారతదేశం, ఏప్రిల్ 27 -- తిరుపతిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తిలో సోదాలు చేపట్టారు. ఆలయాల పరిసరాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుమలలోని విశ్రాంతి గృహాలు, పార్కింగ్‌లోనూ సోదాలు చేపట్టారు. ఎవరిపై అనుమానాలు ఉన్నా.. ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి మరణించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజా రద్దీ స్థలాలు, రవాణా కేంద్రాలు, మతపరమైన ప్రదేశాలలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద...