భారతదేశం, డిసెంబర్ 1 -- టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఇవాళ (డిసెంబర్ 1) కొయంబత్తూర్ లో వివాహమాడిందని తెలిసింది. విశ్వసనీయ వర్గాలు హిందూస్థాన్ టైమ్స్ కు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో సమంత రెండో భర్త ఎవరు? రాజ్ నిడిమోరు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మరి రాజ్ నిడిమోరు గురించి ఇక్కడ తెలుసుకోండి.

రాజ్ అండ్ డీకే ద్వయంతో పాపులర్ అయిన వాళ్లలో ఒకరే రాజ్ నిడిమోరు. ఈయన మన తెలుగు వ్యక్తే. 1975 ఆగస్టు 4న తిరుపతిలో జన్మించాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశాడు.

యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నప్...