భారతదేశం, మే 18 -- తిరుపతి నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. దళిత విద్యార్థి జేమ్స్‌ను కిడ్నాప్ చేశారు. అతనిపై హత్యాయత్నాని పాల్పడ్డారు. రౌడీషీటర్ సాయి రూపేష్, చోటా బ్లేడ్ గ్యాంగ్ అతన్ని చంపేందుకు ప్రయత్నించారని.. జేమ్స్ ఆరోపించారు. బాధిత విద్యార్థి.. విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో విద్యార్థి జేమ్స్‌కు చికిత్స అందిస్తున్నారు. రౌడీషీటర్ అండ్ గ్యాంగ్‌పై తిరుచానూరు పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

'కులం పేరుతో దూషించి, నన్ను చంపేందుకు కుట్ర చేసిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. నన్ను ఒరేయ్ అంబేద్కర్ జాతి నా కొడకా అంటూ.. ప్రతి రోజు అవమానిస్తున్నారు. రౌడీషీటర్ మూత్రం నోట్లో పోసి ఒకటిన్నర రోజు చిత్ర హింసలు పెట్టారు. నాకు న్యాయం జ...