భారతదేశం, సెప్టెంబర్ 3 -- తిరుపతి సందర్శించే యాత్రికులు, పర్యాటకులు త్వరలో సీప్లేన్ రైడ్‌లను ఆస్వాదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణి ఆనకట్ట వద్ద నీటి ఆధారిత ఏరోడ్రోమ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. జల విమానాశ్రయం అన్నమాట. సాహసం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ వచ్చే మార్చి నాటికి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రాంతీయ విమానయాన సేవలను అనుసంధానాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం సీప్లేన్ సేవల కోసం ఎనిమిది ప్రదేశాలను ప్రతిపాదించింది. వాటిలో అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, రుషికొండ ఉన్నాయి. వీటిలో అమరావతి, తిరుపతి మరియు గండికోట మొదటి దశకు షార్ట్‌లిస్ట్ అయ్యాయి.

ప్రాజెక్టులకు సాంకేతిక-సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి, వివరణాత్మక ప్...