Hyderabad, ఆగస్టు 19 -- ఐఎండీబీ ప్రకారం గత నెల అంటే జులైలో ఇండియాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్లు ఎవరో తెలుసా? టాప్ 10లో మరోసారి రెబల్ స్టార్ ప్రభాస్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు ఈ జాబితాను మన తెలుగు హీరోలు పూర్తిగా డామినేట్ చేశారు. ఆరుగురు తెలుగు హీరోలు, తమిళం, హిందీ నుంచి ఇద్దరేసి హీరోలు ఈ జాబితాలో ఉన్నారు.

జులై నెలకుగాను ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియాలో మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితాను మంగళవారం (ఆగస్టు 19) రిలీజ్ చేసింది. అంతకుముందు నెలలాగే జులైలోనూ ప్రభాస్ కు తిరుగు లేకుండాపోయింది. టాప్ 10లో తొలి స్థానం అతనిదే కావడం విశేషం.

ఇక అతని తర్వాత రెండో స్థానంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఉన్నాడు. మూడో స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు.

టాప్ 10లో ప్రభాస్ అగ్రస్థానంలో ఉండగా.. మొ...