భారతదేశం, ఏప్రిల్ 21 -- నూజివీడు.. మామిడి పండ్లకు కేరాఫ్ అడ్రస్. నూజివీడు ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడ కాయలు కోయకముందే వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకొని తోటలను కొనుగోలు చేస్తారు. ఆ పంట వరకు డబ్బులు చెల్లించి.. కోత మొదలు పెడతారు. దీంతో రైతులకు పండ్లతో సంబంధం ఉండదు. కేవలం పండించడమే వారి బాధ్యత.

ఇదంతా ఎలా ఉన్నా.. అసలు సమస్య అక్కడే మొదలవుతోంది. వ్యాపారులకు విక్రయించని రైతులు.. పండ్ల పండాక కోసి.. మార్కెట్లకు తరలిస్తారు. కానీ.. వ్యాపారులు కొనుగోలు చేసిన తోటల్లో.. పండ్లు పూర్తిగా పండకముందే.. కోస్తున్నారు. వాటికి రసాయనాలు పూసి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తున్నారు. ఇలా చేయడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని ఇతర పట్టణాలు, నగరాలకు తరలించి విక్రయిస్తున్నారు.

రసాయనాలతో పక్వానికి తెచ్చిన...