Hyderabad, ఫిబ్రవరి 2 -- భోజనం చేసేటప్పడు మాట్లాడకూడదు, ఫోన్ పట్టుకుని కూర్చోకూడదు, టీవీ చూస్తే అన్నం తినకూడదు ఇలాంటివన్నీ మీరు వినే ఉంటారు. కానీ ఆహారం తయారు చేసేటప్పుడు అంటే వంట చేసేటప్పుడు కూడా మాట్లాడకూదనీ, ఇతర పనులు ఏవీ చేయకూడదనీ ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? ఇది కాస్త విడ్డూరంగా, వింతగా అనిపించినప్పటికీ ఇందులో వాస్తవం ఉందని చెబుతున్నారు ఆహార నిపుణులు.

వంట చేయడం రోజువారి కార్యక్రమంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే ప్రతి ఒక్కరికీ వంట చేయడంలో తమదైన శైలి, పద్థతి ఉంటాయి. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ వంట చేయడానికి ఇష్టపడతారు, మరికొంతమంది టీవీ సీరియల్స్ చూస్తూ వంట చేస్తారు, మరికొంతమంది బిగ్గరగా పాటలు వింటూ వంట చేస్తారు. కానీ ఈ విధంగా వంట చేయడం సరైనదేనా? అంటే కానీ కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం రండి..

వం...